Russia is waging a disgraceful war on Ukraine.     Stand With Ukraine!
  • Raj Prakash Paul

    బ్రతికెద నీ కోసమే • Telugu Christian Songs

Share
Font size
Asli

Lirik బ్రతికెద నీ కోసమే

బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
నా జీవితమే నీకంకితమై
నీదు సేవ జేతు పుణ్యమాని భావింతు
నేను చివర శ్వాస వరకు
 
బ్రతికెద నీ కోసమే స్వామి
బ్రతికెద నీ కోసమే
 
శ్రమయును బాధయు నాకు కలిగినా
వైరులు ఎల్లరు నన్ను చుట్టినా
నీదు న్యాయ శాసనమునే పాటింతు
నాలోని బలము నన్ను విడిచినా
నా కన్ను దృష్టి తప్పిపోయినా
నిన్ను చేరి నీదు శక్తి పొంద
నీదు ఆత్మ తోడ లోక రక్షకా
 
బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
 
వాక్యమే మ్రోగుట విశ్వాసము వెల్లడి చేయుట
ఇహమందున యోగ్యమైన కార్యముగా నే తలచి
నీదు రుధిరంబు చేత నేను
కడగబడిన నీదు సొత్తు కాదా
నిన్ను జూప లోకంబులోన
నీదు వెలుగు దీపముగా నాథా
 
బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
నా జీవితమే నీకంకితమై
నీదు సేవ జేతు పుణ్యమాని భావింతు
నేను చివర శ్వాస వరకు
 
బ్రతికెద నీ కోసమే
నా ఊపిరి నీ ధ్యానమే
 

 

Terjemahan untuk "బ్రతికెద నీ కోసమే ..."
Mohon bantuan untuk menerjemahkan "బ్రతికెద నీ కోసమే"
Komentar