Russia is waging a disgraceful war on Ukraine.     Stand With Ukraine!

లగిజిగి (lagijigi)

A A

లగిజిగి

సోవియట్ల దేశమా, సమతా సందేశమా (x2)
ఆంధ్ర జాతి విప్లవాభి వందనాలు అందుక…
అందుక… అందుక…
అందుక… అందుక…
సోవియట్ల దేశమా…!
 
యుగయుగాల, చీకటిపై పగబట్టిన సమతార్కుడు, (x2)
వ్లాదిమిర్ ఇల్విచ్ లెనిన్ కన్న పసిడి కలల పంట (x2)
సోవియట్ల దేశమా, సమతా సందేశమా
సోవియట్ల దేశమా…!
 
జాతుల చెరసాల వంటి జారుల రష్యాను మారి (x2)
సమభావం సౌభ్రాత్వం సుమధామంగా గూర్చిన (x2)
సోవియట్ల దేశమా, సమతా సందేశమా (x2)
సోవియట్ల దేశమా…!
 
సామ్యవాద పదం మీద శ్రమిక మనో రధం మీద, (x2)
కమ్యునిజం గమ్యానికి క్రమిస్తున్న గమిస్తున్న (x2)
సోవియట్ల దేశమా, సమతా సందేశమా (x2)
ఆంధ్ర జాతి విప్లవాభి వందనాలు అందుక…
అందుక… అందుక…
అందుక… అందుక…
సోవియట్ల దేశమా…!
 
అ…!
ఒ…
 
లగి జిగిజగిల జిగిజగిలగిజ లంబాడే
జనక జనక రే తకిట తకిట తక తాళం వేస్తూ
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
అ…!
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
ఒ…
 
లగి జిగిజగిల జిగిజగిలగిజ లంబాడే
జనక జనక రే తకిట తకిట తక తాళం వేస్తూ
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
అరెరెరె!
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
 
ఎండనక వానానకా, రేయనకా పగలనక (x2)
పాలము పుట్రా యెంటా పనిజేసే కూలన్నా.
ఒ…
పాలము పుట్రా యెంటా పనిజేసే కూలన్నా.
ఓ రైతు కూలన్నా...!
ఎంత కాలం నువ్వు ఏడుస్తా బతికేవు? (x2)
ఒ…
 
లగి జిగిజగిల జిగిజగిలగిజ లంబాడే
జనక జనక రే తకిట తకిట తక తాళం వేస్తూ
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
 
మన కోసం కూలోడు రగతాన్నే చిందించే (x2)
ఎర్రాని ఆ రగతం, వో, జండాలా మాలింగ్
ఒ, ఎర్రాని ఆ రగతం జండాలా మాలింగ్
ఎగసింది ఆ జెండా...!
ఎర్రాని ఆ జెండా మనకోసం నిలిచింది,
ఓ, ఎర్రాని ఆ జెండా మనల్నే పిలిచింది
ఓ…
 
లగి జిగిజగిల జిగిజగిలగిజ లంబాడే
జనక జనక రే తకిట తకిట తక తాళం వేస్తూ
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
అరెరెరె!
తిరగబడర అన్నా ఓహో, తిరగబడర అనా!
 
We want world peace!
We want world peace!
We want world peace!
 
English

 

Login or register to post translation
Comments